Share News

Minister Uttam: ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:44 AM

నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగవద్దని... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Minister Uttam: ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్

న్యూఢిల్లీ: కృష్ణ ట్రిబ్యునల్‌(Krishna Tribunal) పై గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టు (Supreme Court)లో వాదనలు జరగనున్నాయి. న్యాయస్థానంలో తెలంగాణ (Telangana) తరఫున బలమైన వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ప్రతిపాదనకు సూచనప్రాయంగా ఒప్పుకున్నారని, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టీఎంసీలు కేటాయించారని, అందులో మెజార్టీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

అమరావతి కౌలు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త


మరోవైపు ఏపీలో జగన్మోహన్‌రెడ్డి తన అయిదేళ్ల పరిపాలన కాలంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా అటకెక్కించడమే కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాలను జటిలం చేసి వెళ్లారు. అటు కర్ణాటక ఇటు తెలంగాణతో నెలకొన్న పరిష్కారం కాని వివాదాలు దురదృష్టం కొద్దీ కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమనే చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం విచారణ జరుపుతున్న కృష్ణ ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదించేందుకు, అనువైన చర్యలు చేపట్టేందుకు తోడు అంతర్రాష్ట్ర జల వివాదాంశాలపై ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం ఎంతైనా అవసరం. తుంగభద్ర జలాశయం పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి పోయిందని కర్ణాటక ప్రభుత్వం ఎగువ భాగంలో వరసబెట్టి రిజర్వాయర్లు నిర్మాణానికి తలపడుతోంది. తుంగభద్ర జలాశయంలో పూడిక ఏర్పడి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వాస్తవమైనా దానివల్ల ఒక్క కర్ణాటకే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాటాలో కూడా కోత పడుతోంది. ఆంధ్రప్రదేశ్ వాటా 72 టీఎంసీలకు గాను 40 టీఎంసీలు కూడా రావడం లేదు.


జగన్‌ హయాంలోనే 2022లో 29 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కావడమే కాకుండా, జాతీయ హోదా కూడా లభ్యమైంది. అప్పర్ భద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా అప్పట్లో రాయలసీమలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కాని ముఖ్యమంత్రిగా జగన్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పోయారు. కాగా 2020లోనే గంగావతి తాలూకాలో నావళి వద్ద 31 టీఎంసీలతో మరొక ప్రాజెక్టు తెరమీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కూడా తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందనే పేరుతోనే ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇటీవల జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రవేశపెట్టి ఆమోదించమని కోరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎగువ సమాంతర కాలువకు ఆమోదం కోరినట్లు వార్తలు వచ్చాయి. నావళి ప్రాజెక్టు కూడా నిర్మిస్తే తుంగభద్ర జలాశయం ఎగువ భాగంలో 60 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక రెండు రిజర్వాయర్లను అదనంగా నిర్మించుకొంటుంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా సమర్థవంతంగా వాదించేందుకు అనుభవమున్న లాయర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎగువ సమాంతర కాలువ వరద జలాల ఆధారంగా కోరబడినా ప్రయోజనం లేదు. కర్ణాటక పైభాగం నుంచి వచ్చే వరద కిందకు రాకుండా ఆ రాష్ట్రం రిజర్వాయర్లు నింపుకొంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నావళి ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సాగునీటి రంగ సమీక్ష సమావేశాల్లో ఇంజనీరింగ్ అధికారులు అంతర్రాష్ట్ర జల వివాదాల్లో మున్ముందు వచ్చే ఇబ్బందులను వివరంగా నివేదించవలసి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు..

కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 15 , 2025 | 10:44 AM