Case on Shekar Basha: శేఖర్ బాషాపై మరో వేధింపుల వ్యవహారం
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:06 PM
Case on Shekhar Basha: ఆర్జే శేఖర్ బాషా తనను మోసం చేశాడంటూ ఓ బాధితురాలు వాపోయింది. ఓ ఎస్పీ వ్యవహారంలో సాయం చేస్తానని చెప్పి వేధింపులకు గురిచేశాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషాపై (RJ Shekar Basha) మరో వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రెడ్ స్యాండిల్ యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, శేఖర్ బాషా తనను మోసం చేశారని బాధితురాలు లక్ష్మీ ఆరోపించింది. బాధితురాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. గతంలో ఓ అబ్బాయిపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళితే ఎస్పీ శ్రీనివాస్ తనను ట్రాప్ చేశారని ఆమె తెలిపారు. మానసికంగా వేధించి తనపై లైంగిక దాడి చేశాడన్నారు. తనను, తన ఫ్యామిలీని అంతం చేస్తానని ఎస్పీ శ్రీనివాస్ బెదిరిస్తున్నాడని తెలిపారు.
అయితే ఈ కేసు శేఖర్ బాషా తనకు సహాయం చేస్తానని చెప్పి వేధింపులకు గురిచేశాడని బాధితురాలు తెలిపింది. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా తనకు ఓ ఈవెంట్‌లో పరిచయం అయినట్లు చెప్పుకొచ్చారు. ‘‘ఎస్పీపై పెట్టిన కేసును నేను శేఖర్ బాషాకు చెపితే హెల్ప్ చేస్తానని మోసం చేశాడు. షేకర్ బాషా కూడా నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు. శేఖర్ బాషా, ఎస్పీ శ్రీనివాస్ ఇద్దరు చేతులు కలిసి నన్ను హింసిస్తున్నారు’’ అంటూ బాధితురాలు వాపోయింది.
Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్.. కారణమిదే
శేఖర్ బాషా వలన గతంలో ఓ అమ్మాయి చనిపోయిందని వెల్లడించింది. ఎస్పీతో ఉన్న కొన్ని ప్రైవేటు వీడియోలను యూట్యూబ్ ఛాన్సల్‌లో పెట్టి వేధిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఎస్పీ శ్రీనివాస్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. ఎస్పీ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. శ్రీనివాస్ భార్యకు విషయం మొత్తం చెప్పిన కూడా ఆమె కూడా భర్తకు సపోర్ట్ చేస్తోందన్నారు. తనకు న్యాయం కావాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. కాగా.. సోషల్ మీడియాలో ఎస్పీ, శేఖర్ బాషాకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. శేఖర్ బాషా, ఎస్పీ శ్రీనివాస్ తనను మోసం చేశారని గతంలో బాధితురాలు అనేక సార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి...
Minister Komatireddy: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
Fire Accident.. పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..
Read Latest Telangana News And Telugu News