Share News

Amit Shah: అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

ABN , Publish Date - Sep 04 , 2025 | 09:41 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అసలు అయితే సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది.

Amit Shah: అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Amit Shah

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 04: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దు అయినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలతో కలిసి ఆయన అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో తన హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. అసలు అయితే సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగా ముందుగా షెడ్యుల్ కూడా ఖరారు అయింది. కానీ ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీంతో తన హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.


జగదీప్ దన్‌ఖడ్.. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. ఇక ప్రతిపక్షాలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశాయి. అయితే ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఒక చర్చ అయితే సాగుతోంది.


మరోవైపు ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలోని 786 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎస్ఎల్‌బీసీ పనులు ఆగడానికి వీల్లేదు: సీఎం

సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

Read Latest TG News and National News

Updated Date - Sep 04 , 2025 | 09:42 PM