Hyderabad: చలి.. చంపేస్తోంది.. నగరంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:35 AM
ప్రస్తుత చలికాలంలో విపరీతమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిబారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు నూలు వస్ర్తాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు జోరందుకున్నాయి.
- నూలు వస్త్రాలకు పెరుగుతున్న డిమాండ్
- రూ.200 నుంచి 1200 వరకు పలుకుతున్న ధర
హైదరాబాద్: ప్రస్తుత చలికాలంలో విపరీతమైన చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలిబారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు నూలు వస్త్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రతీ సంవత్సరం ఈ సీజనల్ నార్త్ ఇండియన్స్ వచ్చి నగర శివారులోని చందానగర్, శేరిలింగంపల్లి, మియాపూర్(Chandanagar, Serilingampally, Miyapur) ప్రాంతాల్లో రోడ్లవెంబడి షాపులు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేస్తున్నారు.

స్వెటర్లు, రకరకాల క్యాపులు, రగ్గులు అన్ని వయస్సుల వారికి లభ్యమయ్యే విధంగా వ్యాపారులు అందుబాటులో ఉంచారు. వీటిని కొనేందుకు నగర వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు వారికి కావాల్సిన స్వెటర్లు కొనుగోలు చేస్తుండటంతో ఈ షాపులు రద్దీగా మారాయి. రూ.200 నుంచి రూ.1200 వరకు విలువ చేసే వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయి. వారం రోజులుగా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ ఉన్ని వస్ర్తాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.
మూడు నెలలే మా వ్యాపారం
ప్రతీ సంవత్సరం నవంబరు, డిసెంబరు, జనవరి ఈ మూడు నెలలు మాత్రమే మా వ్యాపారం కొనసాగుతుంది. ఏడాది పొడవునా ఇంటి వద్దే ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటాం. చలికాలంలో నూలు వస్ర్తాలు అమ్మకాలు చేస్తాం. మాకు దగ్గర ఉన్న పరిశ్రమలో హోల్‌సేల్‌గా కొని ఇక్కడకు వచ్చి అమ్మకాలు చేస్తాం. ఈ విధంగా జీవనోపాధి సాగిస్తాం. ఢిల్లీ, హర్యానా, లుథియాన తదితర ప్రాంతాలకు చెందిన మా బంధువులు కూడా ఇదే వ్యాపారం చేస్తారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు బాగానే ఉన్నాయి. - దీపక్, మధ్యప్రదేశ్
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News