New Year: 120 ప్రాంతాలు.. 7 ప్లటూన్ల పోలీసులు
ABN , Publish Date - Dec 26 , 2025 | 09:33 AM
31 అర్ధరాత్రి, నూతన సంవత్సన వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం 120 ప్రాంతాల్లో 7 ప్లటూన్ల పోలీసులు గస్తీలు నిర్వహించేలా నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్ని ఏర్పాట్లు చేశారు.
- ఇన్సిడెంట్ ఫ్రీగా న్యూఇయర్ వేడుకలే లక్ష్యం
- డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్
- నేరుగా రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: నూతన సంవత్సర వేడుకలను నగరవాసులు ఇన్సిడెంట్ ఫ్రీగా జరుపుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Hyderabad Police Commissioner Sajjanar) స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగానే వేడుకలు వారం రోజుల ముందు నుంచే నగరంలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే సీపీ..
ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికి సీపీ నేరుగా రంగంలోకి దిగారు. బుధవారం రాత్రి వెస్జుజోన్ పరిధిలోని బంజారాహిల్స్‌లో టీజీ స్టడీ సర్కిల్ వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను సీపీ స్వయంగా పరిశీలించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. డిసెంబరు 31 తెల్లవారుజాము వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సిటీలో మొత్తం 7 ప్లటూన్ల బలగాలతో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డైవ్రింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.
ఒక్కరోజే 304 వాహనాలు సీజ్
బుధవారం రాత్రి నుంచి సిటీలో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. మొదటి రోజే మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 304 మంది పట్టుబడ్డారు. పోలీసులు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసిన కాపీని పట్టుబడిని వారికి అప్పగించారు. మరోసారి మద్యం తాగి వాహనాలు నడపవద్దని కౌన్సెలింగ్ చేశారు. ఇందులో మైనర్ కూడా ఉండటం గమనార్హం. తనిఖీల పర్యవేక్షణలో కమిషనర్‌తో పాటు పశ్చిమ మండలం ఏసీపీ కట్టా హరిప్రసాద్, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సాయిప్రకాశ్ తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News