Hyderabad: సొంత కూతురుని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు.. మ్యాటర్ ఏంటంటే..
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:15 PM
నగర శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ జంట తమ కూతురిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరి వారు తమ కూతురుని ఎందుకు కిడ్నాప్ చేశారు..?
హైదరాబాద్, సెప్టెంబర్ 24: నగర శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ జంట తమ కూతురిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరి వారు తమ కూతురుని ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఎప్పుడు జరిగింది..? ఎక్కడ జరిగింది..? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బుధవారం ఉదయం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. తల్లిదండ్రులు తమ కన్న కూతురుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు కారణం ప్రేమ వివాహమేనని తెలుస్తోంది. నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ.. ప్రవీణ్, యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వివాదం కొనసాగుతోంది. నాలుగు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా.. బుధవారం నాడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
యువతి తల్లిదండ్రులు తమ బంధువులతో కలిసి బుధవారం తెల్లవారుజామునే ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. ప్రవీణ్‌పై అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం కారంపొడి చల్లి, కళ్లకు బట్టలు కట్టి యువతిని ఎత్తుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. అయితే, అమ్మాయి భర్త ప్రవీణ్.. పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
NEET 2025 Topper Anurag Anil: నీట్‌లో 99.99 శాతం మార్కులు కానీ.. డాక్టర్ అవ్వాలని లేదని..
Medical Seats : దేశంలో భారీగా మెడికల్ సీట్లపెంపు, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
For More Telangana News and Telugu News..