NEET 2025 Topper Anurag Anil: నీట్‌లో 99.99 శాతం మార్కులు కానీ.. డాక్టర్ అవ్వాలని లేదని..
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:06 PM
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన NEET UG 2025 పరీక్షలో 99.99 శాతం స్కోర్ సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ ఎగ్జామ్‌కు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే, దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారు. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడం చాలా అంటే చాలా కష్టం. అయితే, ఓ విద్యార్థి ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ-2025 పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. ఏకంగా 99.99 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. కానీ, అతడికి డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. దీంతో తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
డాక్టర్ కావడం ఇష్టం లేక..
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన NEET UG 2025 పరీక్షలో 99.99 శాతం స్కోర్ సాధించాడు. OBC కేటగిరీలో అతనికి 1475వ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. వైద్య కళాశాలలో అడ్మిషన్‌కు అర్హత సాధించడంతో కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషపడ్డారు. అయితే, డాక్టర్ కావడం అనురాగ్‌కు ఇష్టం లేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఇక ఇష్టం లేని చదువు తాను చదవలేనని MBBS అడ్మిషన్ కోసం బయలుదేరాల్సిన రోజున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఒక సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తనకు డాక్టర్ కావడం ఇష్టం లేదని రాసి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ నోట్‌లోని పూర్తి విషయాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కేసును నవర్గావ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ రోజుల్లో చాలా మంది టీనేజ్ విద్యార్థులు చదువులు, కెరీర్ విషయంలో చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్న విషయాలకే మనస్థాపనాకి గురై ఆత్మహత్య చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. అయితే, విద్య అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఒక్క పరీక్షలో ర్యాంక్ రాకపోయినా లేదా ఇష్టం ఉన్న కోర్సు చదవలేకపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. మీకు ఏ విషయంలోనైన ఒత్తిడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా స్నేహితులతో చెప్పండి. మీ సమస్యను వారికి చెప్పడం వల్ల మనసు కుదుటపడుతుంది. ఆ తర్వాత మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
Also Read:
నవరాత్రి ఉత్సవాలు.. ఈ దేవాలయాలను సందర్శించడం మర్చిపోకండి
లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్
For More Latest News