Medical Seats: దేశంలో భారీగా మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:47 PM
దేశంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లలో భారీ పెంపునకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5,000 కొత్త పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్ల (Medical Education)లో భారీ పెంపునకు ఇవాళ (బుధవారం) కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి, ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్ కోసం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్(CSS) విస్తరణకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఫలితంగా దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు వీలవుతుంది(Healthcare access in rural India). సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ 3వ దశ కింద ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడేషన్ ద్వారా 5,000 కొత్త పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు ఆమోదం తెలిపింది. తాజా మార్పులతో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు 1,18,190కి, పీజీ సీట్లు 74,306కి చేరుకుంటాయి.
మొత్తం రూ.15,034.50 కోట్ల బడ్జెట్ (2025-26 నుంచి 2028-29 వరకు)తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.10,303.20 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు. ఈ విస్తరణ వైద్యులు, స్పెషలిస్టుల సంఖ్యను పెంచి గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థులకు మరిన్ని వైద్య వృత్తి అవకాశాలు, ఉద్యోగాలు (వైద్యులు, ఫ్యాకల్టీ, పారామెడికల్ సిబ్బంది) సృష్టించడంతోపాటు భారతదేశాన్ని సరసమైన ఆరోగ్య సేవల గ్లోబల్ హబ్‌గా మార్చుతుంది.
ఇప్పటికే దేశంలో 808 మెడికల్ కళాశాలలో 1,23,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నప్పటికీ, డిమాండ్‌కు తగ్గట్టు సామర్థ్యం పెంచడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మార్పుల అమలుకు మార్గదర్శకాలు వెంటనే జారీ చేస్తుంది. ఈ నిర్ణయం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) లక్ష్యాన్ని సాకారం చేస్తూ, దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News