New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్.. ఆ పనిచేస్తే జైలుకే..
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:33 PM
తెలంగాణలో న్యూ ఇయర్ (2026) వేడుకలను టార్గెట్ చేసుకొని నగరంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్‌ని అరెస్ట్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
హైదరాబాద్: ఇటీవల తెలంగాణ(Telagana)లో ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) పరిధిలో తరుచూ డ్రగ్స్ పట్టుబడటం చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ స్మగ్లర్ల (Drug smugglers)పై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) గట్టి నిఘా పెడుతున్నప్పటికీ కొత్త కొత్త పద్దతుల్లో ఈ దందా కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు (New Year celebrations) రాబోతున్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ దందా చేసేవారిపై నార్కొటిక్స్ బ్యూరో(Narcotics Bureau)తో పాటు హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేసిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న బీటెక్ స్టూడెంట్ (B Tech student) న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ పార్టీ చేసుకునేందుకు ఎండీఎంఏ డ్రగ్స్ (MDMA drugs) తీసుకువస్తున్న విషయం తెలుసుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగుళూర్ (Bangalore) నుంచి డ్రగ్స్ (drugs) తీసుకువస్తున్నట్లు సమాచారం. నిందితుడి దగ్గర నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో యుత్‌కి ఈ డ్రగ్స్ సప్లై చేసి భారీగా డబ్బు సంపాదించాలనే ప్లాన్ చేశాడు సదరు విద్యార్థి. మాదాపూర్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విద్యార్థిని అనుమానించి అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్ విషయం బయటపడింది. నిందితుడు ఎంత తీసుకువచ్చాడు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ (DCP) సీహెచ్.శ్రీనివాస్ ఏబీఎన్ తో మాట్లాడుతూ.. న్యూ ఇయర్ వేడుకలు కేవలం ఆనందం, అహ్లాదం కోసం మాత్రమే ఉండాలి, హద్దు మీరి డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, అనుమతులు లేకుండా పార్టీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా నిర్వాహకులు చూసుకోవాలని.. డ్రగ్స్‌పై లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు ఈగల్ టీమ్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఈవెంట్లకు సామర్ధ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదని తేల్చి చెప్పారు.
'ఒకవేళ ఈవెంట్స్ కి ఎవరైనా సెలబ్రెటీలు వస్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారాన్ని ఇవ్వడం వల్ల భద్రత కల్పించడం తేలిక అవుతుంది. పార్టీలకు, పబ్బులకు మైనర్లను అనుమతించకూడదు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. సంబరాల పేరుతో మద్యం సేవించి రోడ్లమీదకి రాకూడదు. మైనర్లు వాహనాలు తీసుకుని రోడ్ల మీద కాకుండా తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలి. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడికక్కడ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాం.. ఒకవేళ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది' అని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దొంగ చేతికి తాళాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి