Share News

Hyderabad: ముసారాంబాగ్‌ బ్రిడ్జి బంద్‌..

ABN , Publish Date - Aug 30 , 2025 | 07:37 AM

జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్లను ఎత్తడంతో పాటు ట్యాంక్‌బండ్‌ (హుస్సేన్‌సాగర్‌) నుంచి నీటిని విడుదల చేయడంతో శుక్రవారం ఉదయం నుంచి మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది.

Hyderabad: ముసారాంబాగ్‌ బ్రిడ్జి బంద్‌..

- మూసీలో పెరిగిన వరద ఉధృతి

- తాత్కాలికంగా మూసివేసిన పోలీసులు

హైదరాబాద్: జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌(Osman Sagar, Himayat Sagar) గేట్లను ఎత్తడంతో పాటు ట్యాంక్‌బండ్‌ (హుస్సేన్‌సాగర్‌) నుంచి నీటిని విడుదల చేయడంతో శుక్రవారం ఉదయం నుంచి మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేసినట్లు మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. వాహనదారులు, పాదచారుల రాకపోకలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనాలను గోల్నాక బ్రిడ్జి మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో బ్రిడ్జిపై ట్రాఫిక్‌ ఒత్తిడి పెరిగింది.


city4.2.jpg

చాదర్‌ఘాట్‌ కాజ్‌వే ఓకే

మూసీలో వరద ప్రవాహం పెరిగినప్పటికీ చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే బ్రిడ్జిపై శుక్రవారం వరద ప్రవాహం ప్రభావం అంతగా కనిపించలేదు. బ్రిడ్జి కింద నుంచే వరద ప్రవహిస్తుండడంతో చాదర్‌ఘాట్‌ మూసానగర్‌, కమల్‌నగర్‌ బస్తీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 07:37 AM