Heavy Rains: నేడు అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
ABN , Publish Date - Jul 24 , 2025 | 08:35 AM
వర్షాకాలంలోనూ మొన్నటిదాకా భానుడి భగభగలు చూశాం. అయితే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గురువారం కూడా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది..
వర్షాకాలంలోనూ మొన్నటిదాకా భానుడి భగభగలు చూశాం. అయితే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే గురువారం కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు..
తెలంగాణలో (Telangana) గురువారం అత్యంత భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, కుమురం భీమ్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఆరెంట్ అలెర్ట్ జారీ చేశారు.
అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హనుమకొండ, వరంగల్, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్‌తో సహా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News