Hyderabad: ఒకటికాదు..రెండుకాదు.. రూ.54.67 లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:39 AM
బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
- బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ పేరుతో ఐటీ ఉద్యోగికి సైబర్ టోకరా.. రూ.54.67 లక్షలు కొట్టేశారు
పటాన్‌చెరు(సంగారెడ్డి): బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్(Patancheru Police Station) పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం.. బాలానగర్ హెచ్‌సీఎల్ ఉద్యోగి ఇక్కడి ప్రణీత్ కాలనీలో ఉంటున్నారు.
ఈ నెల 15న ఆయన ఫోన్‌లోని టెలిగ్రామ్‌కు ఓ మెసేజ్ వచ్చింది. లింక్ తెరిచి చూడగా బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామని ఉంది. దీంతో సందీ్‌పరెడ్డి లింక్‌లో ఉన్న విధంగా ఆన్‌లైన్ ఖాతా తెరిచి, ప్రారంభంలో రూ. 5 వేలు వేశాడు. ఇందుకు రూ.12,500 లాభం చూపించారు. మరోసారి రూ.59,800 వేశాడు. క్రమేపీ 7,14,180 రూపాయలు జమ చేశారు. లాభాలు వెనక్కి తీసుకోబోతే క్రెడిట్ స్కోరు(Credit score) నిమిత్తం రూ.5 లక్షలు కట్టమన్నారు.

వీఐపీ చానల్ ఓపెన్ చేయాలంటూ రూ.6 లక్షలు, డబ్బులు విత్‌డ్రా చార్జీలు రూ.12.5 లక్షలు అని మొత్తంగా రూ. 54,67,488 ఖాతాలో జమ చేయించుకున్నారు. చివరగా మరో రూ.8 లక్షలు కడితే మొత్తం డ్రా చేసుకోవచ్చని ఆశ చూపడంతో సందీ్‌పరెడ్డికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa