Share News

Hyderabad: ఖాళీ కొబ్బరి బొండాలతో.. జర జాగ్రత్త

ABN , Publish Date - May 08 , 2025 | 10:16 AM

కొబ్బరిబొండాలు.. ఇవి ఎంత ఆరోగ్యకరమో అందరికీ తెలుసు. అయితే.. అవి తాగిపడేసిన తర్వాత వాటిని దేనికైనా ఉపయోగించుకోకపోతే అవి ప్రమాదరంగా మారే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఆ బోండాల్లోకి నీరు చేరి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది వివిధ అంటు రోగాలకు దారితీస్తున్నాయి.

Hyderabad: ఖాళీ కొబ్బరి బొండాలతో.. జర జాగ్రత్త

- వాటితో దోమలు వృద్ధి చెందుతున్నాయంటున్న వైద్యులు

- ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేస్తున్న వ్యాపారులు

- పట్టించుకోని అధికారులు

హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే కొబ్బరి బొండాం నీళ్లు తాగేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. తాగి పడేసిన కొబ్బరి బొండాలతో ప్రమాదం పొంచి ఉందని తెలియడం లేదు. ఖాళీ బొండాలను రోడ్డుపక్కన, ఇంటి పరిసరాల్లో పడేస్తే వాటిల్లో లార్వా వృద్ధి చెంది డెంగీ దోమలుగా రూపాంతరం చెందుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాగి పడేసిన కొబ్బరి బొండాలు, తాగిన ప్లాస్టిక్‌ టీ గ్లాసులను సంచుల్లో కట్టి జనావాసాలకు దూరంగా పడేయాలి. కానీ వ్యాపారులు ఇదేమీ పట్టించుకోకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని వైద్యులు అంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం.. ఎంత ఘోరం జరిగిందో..


డంపింగ్‌కు నిలయాలు వారాంతపు సంతలు

వారాంతపు సంతలు చెత్త డంపింగ్‌కు నిలయాలుగా మారుతున్నాయి. బాలానగర్‌, ఓల్డుబోయినపల్లిలో వారాంతపు సంతలు ముగిశాక వ్యాపారులు చెత్తను అక్కడే పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓల్డుబోయినపల్లి బ్యాంక్‌ కాలనీ, మల్లికార్జున నగర్‌, ఎల్బీనగర్‌, హస్మత్‌పేట, సమతానగర్‌ , బాలానగర్‌ డివిజన్‌ వినాయకనగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, ప్రశాంతినగర్‌ ఏరియాల్లో వారాంతపు సంతలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌ ప్రధాన రహదారి వెంట ఫుట్‌పాత్‌పై కొందరు కొబ్బరి బొండాలు, టైరు పంక్చర్‌ షాపులు, మధ్యాహ్న భోజనం దుకాణాలను నిర్వహిస్తున్నారు. చీకటి పడగానే ఖాళీ కొబ్బరి బొండాలు, తిన్న పేపర్‌ ప్లేట్లు, గ్లాసులు అక్కడే వదిలేస్తున్నారు.

city5.2.jpg


ఐడీపీఎల్‌ ఫుట్‌పాత్‌పై నడవలేక పోతున్నాం

ఐడీపీఎల్‌ ఫుట్‌పాత్‌పై చెత్తా చెదారం, ఖాళీ కొబ్బరి బొండాలు వేస్తున్నారు. నడవ లేకపోతున్నాం. ఫుట్‌పాత్‌పై చెత్తాచెదారం వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- జి. సతీష్‌, బాలానగర్‌


వారంలో రెండు రోజులు దోమల మందు పిచికారీ చేస్తున్నాం

వారంలో రెండు రోజులు దోమల మందు పిచికారీ చేస్తున్నాం. లార్వా వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి.

- స్వామి, ఎంటమాలజీ

సూపర్‌వైజర్‌, బాలానగర్‌


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత

Operation Sindoor: సిందూరమే.. సంహారమై

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2025 | 10:16 AM