Hyderabad: అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య..
ABN , Publish Date - May 18 , 2025 | 12:08 PM
పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులు సంఖ్య భారీగా పెరుగుతోంది. తొలుత 8 మంది చనిపోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్, మే 18: పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులు సంఖ్య భారీగా పెరుగుతోంది. తొలుత 8 మంది చనిపోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారు వీరే..
ప్రహ్లాద్ (70)
మున్ని (70)
రాజేందర్ మోదీ (65)
సుమిత్ర (60)
హమేయ్ (7)
అభిషేక్ (31)
శీతల్ (35)
ప్రియాన్ష్ (4)
ఇరాజ్ (2)
ఆరూష్ (3)
రిషబ్ (4)
ప్రథమ్ (1.5)
అనుయాన్ ( 3)
వర్ష (35)
పంకజ్ (36)
రజిని (32)
ఇడ్డు (4)
కాగా, ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చార్మినార్‌లోని గుల్జర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. జీ+2 భవనంలో మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో మంటలు చెలరేగి.. పై అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. వీరిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
Also Read:
ప్రమాదం ఎలా జరిగిందో వివరించిన అధికారులు
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పలువురు
For More Telangana News and Telugu News..