Share News

Hyderabad CP-Mock Drill: 54 ఏళ్ల తర్వాత సిటీలో మాక్ డ్రిల్: సీపీ ఆనంద్

ABN , Publish Date - May 07 , 2025 | 07:36 PM

ఆపరేషన్ సిందూరం నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ మధ్యాహ్నం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరిట భాగ్య నగరంలో నిర్వహించిన కార్యక్రమం గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్..

Hyderabad CP-Mock Drill:  54 ఏళ్ల తర్వాత సిటీలో మాక్ డ్రిల్: సీపీ ఆనంద్
Hyderabad CP-Mock Drill

Hyderabad CP-Mock Drill: పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. 54 సంవత్సరాల తర్వాత జరిగిన మాక్ డ్రిల్ ఇదని ఆయన పేర్కొన్నారు. మాక్ డ్రిల్ లో.. తమ తమ లోపాలను సమీక్షించుకుని అప్రమత్తత మెరుగు పర్చేలా చేశామని తెలిపారు. యుద్ధానికి సంబంధించి లేదా ఇతర ఏ విషయాలకు సంబంధించైనా తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

cv-anand.jpgఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించన అనంతరం సీపీ సీవీ అనంద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇందులో ఆయన ఏం చెప్పారంటే.. "నాలుగు గంటలకు కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి అలెర్ట్ ఇచ్చాం. రెండు నిమిషాల పాటు పోలీస్, ఫైర్ వాహనాలు, ఇండస్ట్రియల్ సైరన్లు మోగాయి. నాలుగు ప్రాంతాల్లో మిస్సైల్ అటాక్ జరిగినట్టు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సందేశం ఇచ్చాం. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. నాలుగు ప్రాంతాల్లో పోలీసులు, మెడికల్, ఫైర్ డిజాస్టర్ రెవిన్యూ ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉన్నారు. మిస్సైల్ అటాక్ జరిగిన ప్రాంతాలకు తరలి వెళ్లడం.. మంటలు అంటుకుంటే ఆర్పడం వంటి అంశాలను డ్రిల్ లో చూపించాం. అంబులెన్స్ లు రావడానికి వెళ్లడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చాం. ఈ మాక్ డ్రిల్ లో లా అండ్ ఆర్డర్ పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేశారు. మాక్ డ్రిల్ లో భాగంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు." అని ఆనంద్ వెల్లడించారు. ఇలా ఉండగా, అటు నగరంతో పాటు, ఏపీలోని కీలక నగరమైన విశాఖలోనూ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 07:36 PM