Service revolver: ఆ ఎస్‌ఐ సర్వీస్ రివాల్వర్ ఎక్కడ ఉన్నట్లు?
ABN , Publish Date - Nov 29 , 2025 | 07:47 AM
నగరంలోని అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌ను ఏం చేశారన్న దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆ అటు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు సిటీ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ రివాల్వర్‌కు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- పోలీసుల ముమ్మర దర్యాప్తు
- ఎస్‌ఐ పొంతనలేని సమాధానాలు
హైదరాబాద్ సిటీ: అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి(Amberpet SI Bhanu Prakad Reddy) సర్వీస్ రివాల్వర్ కోసం స్థానిక పోలీసులు, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి వేర్వేరుగా సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. ఏఈ పరీక్ష రాయడానికి విజయవాడ(Vijayawada)కు వెళ్లినప్పుడు పోయిందని, మరోసారి సొంత ఊరికి వెళ్లినప్పుడు పోయిందని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.
ఈ విషయంపై ఈస్ట్‌జోన్ పోలీసులు(East Zone Police) విజయవాడకు వెళ్లి దర్యాప్తు చేసినట్లు తెలిసింది. అక్కడ వారికి ఎలాంటి క్లూ లభించలేదని సమాచారం. ఈ విషయంలో భానుప్రకాష్ రెడ్డి మామ తన కుమార్తె గర్భవతిగా ఉందని, ఆమెను ఎక్కువగా ప్రశ్నించవద్దని పోలీసులను కోరినట్లు తెలిసింది. తమ అల్లుడు క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టే విషయం తమకు తెలియలేదని ఆయన పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం. భానుప్రకాష్ రెడ్డి డీఎస్ఐగా పని చేస్తున్నప్పటికీ చేసిన రికవరీలపై పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News