Share News

Train Delays: వానలతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:41 AM

మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్‌ నుంచి బయల్దేరే పలు రైళ్ల రాకపోకలపై పడింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది.

Train Delays: వానలతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

  • 7 గంటలు ఆలస్యంగా హుస్సేన్‌ సాగర్‌, గౌతమి ఎక్స్‌ప్రెస్‌

  • పలు రైళ్లను రీషెడ్యూల్‌ చేసిన దక్షిణ మధ్య రైల్వే

  • ఇంటికన్నెలో 2 గంటలపాటు నిలిచిన ‘ఎల్‌టీటీ’

  • తీర్థయాత్రలకు వెళ్లి చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు

హైదరాబాద్‌ సిటీ, కేసముద్రం, మంచిర్యాల, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్‌ నుంచి బయల్దేరే పలు రైళ్ల రాకపోకలపై పడింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది. బుధవారం హైదరాబాద్‌ నుంచి ముంబైకి బయల్దేరాల్సిన హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రె్‌సను 7గంటలు ఆలస్యంగా రాత్రి 9.55గంటలకు రీషెడ్యూల్‌ చేశారు. ముంబై నుంచి లింగంపల్లికి రావాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ 7గంటలు ఆలస్యంగా వచ్చింది. ఇదే రేక్‌తో కాకినాడకు వెళ్లాల్సిన గౌతమి ఎక్స్‌ప్రె్‌సను గురువారం ఉదయం 1.30కు(7గంటలు ఆలస్యం) రీషెడ్యూల్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో విశాఖ నుంచి ముంబై వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలపాటు నిలిచిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో వరంగల్‌ నుంచి కొత్త ఇంజన్‌ తీసుకువచ్చి అమర్చాక రైలు ముందుకు కదిలింది. దీంతో 2 గంటలపాటు అప్‌లైనులో వెనుక ఉన్న కొన్ని స్టేషన్ల వరకు రైళ్లు నిలిచిపోయాయి.


మహారాష్ట్రలో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు

తీర్థయాత్రలకు వెళ్లిన 28 మంది తెలంగాణ వాసులు భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో చిక్కుకుపోయారు. మంచిర్యాల, గోదావరిఖనికి చెందిన కొందరు తీర్థయాత్రలో భాగంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా గగన్‌బావడాకు చేరుకోగా వీరి బస్సును పోలీసులు నిలిపివేశారు. వరదల కారణంగా ముందుకు వెళ్లలేరంటూ అక్కడే ఓ దాబా హోటల్‌ సమీపంలో చిన్న రేకుల షెడ్డులో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. అయితే తమకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదని, కరెంటు కూడా లేకపోవడంతో భయబ్రాంతులకు గురవుతున్నామని మహిళలు, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 04:41 AM