Share News

Weather Update: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్..

ABN , Publish Date - May 27 , 2025 | 07:02 PM

వర్షాకాలం ముందే వచ్చేసింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

Weather Update: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్..

వర్షాకాలం ముందే వచ్చేసింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.


నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి (Telangana) విస్తరించాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోవు రెండు, మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున పాత భవనాలు, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


Also Read:

బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు!

బీసీసీఐ గొప్ప మనసు!

For More Telangana News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 07:47 PM