Harish Rao: యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:32 AM
యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుల కష్టాలను రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు..
బీజేపీ, కాంగ్రెస్ హైడ్రామాలు చేస్తున్నాయి
రైతుల కష్టాలను రాజకీయం చేయడం సిగ్గుచేటు: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుల కష్టాలను రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించాలని ఎక్స్‌లో డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు కుండపోత వర్షంలో తడుస్తూ గంటల తరబడి క్యూలో నిలబడడం, అధికారుల కాళ్లు పట్టుకోవడం వంటి దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. సీఎం ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తానన్న రేవంత్‌రెడ్డి.. యూరియానే బంగారంలా మార్చారని ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు యూరియా కొరత రాలేదని చెప్పారు. యూరియా కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హైడ్రామా సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్రం చెబుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రమే సరఫరా చేయడం లేదంటున్నారని, ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News