Harish Rao: మల్లన్నసాగర్ నిర్వాసితులను ఆదుకోండి
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:47 AM
సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

పునరావాస కాలనీలకు మహర్దశ పట్టిస్తానన్న మాట ఏమైంది?: హరీశ్
హైదరాబాద్, సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు శనివారం సీఎంకు రాసిన లేఖలో నిర్వాసితుల తరఫున వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ని ర్వాసితులకు అండగా ఉంటానని ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్వాసితులు ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారన్నారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసీ నదిలోకి గోదావరి జలాలను తరలించడానికి మల్లన్నసాగర్‌పై ఆధారపడ్డారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, దాంతో ప్రయోజనం లేదని సీఎం స్వయంగా విమర్శలు చేశారని, మరి అదే ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీళ్ల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయండి: కవిత
రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయకుండా పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన విద్యార్థులతో శనివారం ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో ఆమె మాట్లాడా రు. పేద విద్యార్థులకు విదేశీ విద్య అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News