Share News

Harish Rao Met KCR: నోటీసులపై ఏం చేద్దాం.. మామ-అల్లుడు మంతనాలు

ABN , Publish Date - May 22 , 2025 | 06:17 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాం హౌస్‌లో హరీష్‌రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మామ-అల్లుడు చర్చించినట్లు తెలుస్తోంది.

Harish Rao Met KCR:  నోటీసులపై ఏం చేద్దాం.. మామ-అల్లుడు మంతనాలు
Harish Rao And KCR

కాళేశ్వరం నిర్మాణం వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. ఈ నేపధ్యంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కమిషన్‌ నోటీసులు పంపింది. జూన్‌ 5వ తేది లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపింది.


ఈ నేపధ్యంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాం హౌస్‌లో హరీష్‌రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మామ-అల్లుడు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. నోటీసులకు ఎలా స్పందించాలన్న అంశంపై ఇరువురు మంతనాలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కమిషన్ ముందు కేసీఆర్, హరీష్‌రావులు విచారణకు హాజరవుతారా? లేదా ఆరోగ్యం సరిగా లేదు.. రాలేమని తప్పించుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Also Read:

ఆ విషయంపై దమ్ముంటే లేఖ రాయాలి.. కేటీఆర్‌కు మహేష్‌గౌడ్‌ మాస్ సవాల్

సేవకు రమన్నారు.. అవమానించారు.. అన్నవరంలో ఏఈవో నిర్వాకం

For More Telugu And National News

Updated Date - May 22 , 2025 | 06:20 PM