Harish Rao: బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:14 AM
బీఆర్‌ఎస్ పాలనలో నిర్మాణరంగం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ స్వర్గధామంగా ఉందని, పదేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి రేటులో ఉందని మాజీ హరీశ్ రావు అన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో స్వర్గధామంగా తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో కుదేలైన రియల్ రంగం: హరీశ్
పేట్‌బషీరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పాలనలో నిర్మాణరంగం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ స్వర్గధామంగా ఉందని, పదేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి రేటులో ఉందని మాజీ హరీశ్ రావు అన్నారు. బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం కొంపల్లిలోని శ్రీరెసిడెన్సీకి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే బిల్డర్లకు ఇవ్వమని చెప్పారని, దీంతో ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బిల్డర్లకు లైన్‌లు కట్టి లోన్‌లు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం కుదేలైందన్నారు. అపార్ట్‌మెంట్ అమ్ముడుపోక.. బ్యాంకుల్లో అప్పులు పుట్టక ఆత్మస్తైర్యం కోల్పోయి వేణుగోపాల్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఆత్మహత్య చేసుకుంటే.. ఇప్పుడు బిల్డర్లు కూడా ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం వల్ల దాపురించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలో భాగంగా తీసుకువచ్చిన హైడ్రా వల్లే దారుణాలు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ రంగానికి బిల్డర్లు దూరమవుతున్న కారణంగా.. లక్షలాది మంది ఉపాధి దొరక్క అవస్థలు పడుతున్నార న్నారు. ఆర్థిక అవసరాల కోసం ఉన్న ఫ్లాట్లు, ఇండ్లను అమ్ముకోకుండా హైడ్రా పేరుతో ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా దుకాణం బంద్ చేసుకోవాలని సలహానిచ్చారు. వేణుగోపాల్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్రప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని బిల్డర్ల అసోసియేషన్‌లు అండగా నిలిచి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి