Share News

Ration cards: రేషన్‌కార్డులు లేనివారికి గుడ్‌న్యూస్‌.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Feb 11 , 2025 | 08:55 AM

నేటి నుంచి ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల్లో(Mee-Seva Centers) రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రేషన్‌కార్డుల(Ration cards) దరఖాస్తు నిరంతరం ప్రక్రియ అనే విషయాన్ని పలుమార్లు ప్రకటించిన విషయం విదితమే.

Ration cards: రేషన్‌కార్డులు లేనివారికి గుడ్‌న్యూస్‌.. విషయం ఏంటంటే..

హైదరాబాద్: నేటి నుంచి ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల్లో(Mee-Seva Centers) రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రేషన్‌కార్డుల(Ration cards) దరఖాస్తు నిరంతరం ప్రక్రియ అనే విషయాన్ని పలుమార్లు ప్రకటించిన విషయం విదితమే. సోమవారం సాయంత్రం 5 గంట ల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఈ వార్తను కూడా చదవండి: GHMC: ఆహా.. ఏం ఐడియా.. సొంత కార్లు.. అద్దె వాహనాలుగా..


ఈ సమాచారం ప్రజలకు తెలియకపోవడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం(Sherilingampally Constituency)లోని మాదాపూర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌(Chandanagar), శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌(Gachibowli, Kondapur) డివిజన్లలో సోమవారం దరఖాస్తులు చేసుకోలేదని మీ-సేవ సిబ్బంది తెలిపారు.


మంగళవారం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు. గతంలో రేషన్‌కార్డులో పేరు కలుపడం, లేదా తొలగింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కాని కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 08:55 AM