Agriculture: రైతులకు శుభవార్త.. మార్కెట్లోకి కొత్త ఉత్పత్తి..
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:52 AM
గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐఎస్‌కే జపాన్‌తో కలిసి మొక్కజొన్న రైతుల కోసం కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్: గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐఎస్‌కే జపాన్‌తో కలిసి మొక్కజొన్న రైతుల కోసం కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'అశితాకా' అనే కొత్త కలుపు నివారణ మందును ఆవిష్కరించడం ద్వారా మొక్కజొన్న సాగులో ఎదురయ్యే ప్రధాన సవాలును అధిగమించడానికి ఒక వినూత్న పరిష్కారాన్ని అందించింది. పంట తొలి దశలో కలుపు మొక్కల వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించే లక్ష్యంతో గడ్డి, వెడల్పాటి ఆకులు గల కలుపును అణచివేసేలా ఈ మందును రూపొందించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మొక్కజొన్న రైతుల కోసం..
మొక్కజొన్న పంటకు దిగుబడినిచ్చే కీలక దశలైన పూత, గింజ దశల్లో మొక్క ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. 'అశితాకా' కలుపును సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా నేలలోని తేమ, పోషకాలను పూర్తిగా మొక్కకు అందేలా చేస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఉత్పత్తి, త్వరలో దేశంలోని ఇతర మొక్కజొన్న సాగు ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. ఈ ఆవిష్కరణ దేశంలో పెరుగుతున్న మొక్కజొన్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడటమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆశిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News