Share News

GHMC: జీహెచ్‌ఎంసీలో జనరేటివ్‌-ఏఐ..

ABN , Publish Date - Aug 05 , 2025 | 07:39 AM

పారదర్శక సేవలు, పౌర సమస్యల పరిష్కారం, పాలనా వ్యవహారాల్లో సంస్కరణలకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పౌర సేవలు మొదలు ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్‌ పార్కింగ్‌, బస్సుల రియల్‌ టైం ట్రాకింగ్‌, రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ మోడల్స్‌, ప్రాజెక్టు టెండర్‌ మూల్యాంకనం, కీటక జనిత వ్యాధుల నివారణ, నిర్మాణరంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌ నియంత్రణను సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని భావిస్తోంది.

GHMC: జీహెచ్‌ఎంసీలో జనరేటివ్‌-ఏఐ..

- అధునాతన సాంకేతికత వినియోగంపై దృష్టి

- మెరుగైన పాలనా వ్యవహారాల నిర్వహణే లక్ష్యం

- గూగుల్‌ భాగస్వామ్యంతో పైలెట్‌ ప్రాజెక్టు

- గూగుల్‌ బృందంతో ఇలంబరిది, కర్ణన్‌ చర్చలు

హైదరాబాద్‌ సిటీ: పారదర్శక సేవలు, పౌర సమస్యల పరిష్కారం, పాలనా వ్యవహారాల్లో సంస్కరణలకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. పౌర సేవలు మొదలు ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్‌ పార్కింగ్‌, బస్సుల రియల్‌ టైం ట్రాకింగ్‌, రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ మోడల్స్‌, ప్రాజెక్టు టెండర్‌ మూల్యాంకనం, కీటక జనిత వ్యాధుల నివారణ, నిర్మాణరంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌ నియంత్రణను సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని భావిస్తోంది.


city3.4.jpg

ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ) కంటే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ జనరేటివ్‌ ఏఐని వినియోగించాలని నిర్ణయించారు. గూగుల్‌(Google) భాగస్వామ్యంతో త్వరలో ఏదైనా సర్కిల్‌లో జనరేటివ్‌ ఏఐ ఆధారిత పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇది విజయవంతమైతే గ్రేటర్‌ వ్యాప్తంగా విస్తరించనున్నట్టు సంస్థ పేర్కొంది. పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబరిది,


city3.jpg

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఇతర అధికారులు సోమవారం గూగుల్‌ మీట్‌ ద్వారా గూగుల్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ బృందంతో ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. హైదరాబాద్‌ను జనరేటివ్‌ ఏఐ నగరంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భావిస్తోన్న నేపథ్యంలో బల్దియాలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ముందడుగు కానుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


స్మార్ట్‌, హెల్తీ హైదరాబాద్‌కు కీలకం

గూగుల్‌ భాగస్వామ్య ప్రాజెక్టు జీహెచ్‌ఎంసీ డిజిటల్‌ పరివర్తన ప్రయాణంలో మైలురాయిగా నిలవనుందని ఇలంబరిది, కర్ణన్‌ తెలిపారు. ఇది పౌరులందరికీ స్మార్ట్‌, ఆరోగ్యకరమైన, ఫ్రెండ్లీ హైదరాబాద్‌ను నిర్మించే దిశగా కీలక పరిణామమని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Updated Date - Aug 05 , 2025 | 07:39 AM