GHMC: జీహెచ్‌ఎంసీకి అదనపు కమిషనర్లు..
ABN , Publish Date - Dec 31 , 2025 | 08:05 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించిన నేపధ్యంలో.. అదనపు కమిషనర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధి గణనీయంగా పెరిగిన నేపధ్యంలో పనిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
- తూర్పు, పశ్చిమాన ఉన్న మూడు జోన్లకు ఒకరు చొప్పున నియామకం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (టీసీయుఆర్‌ఈ) వరకు విస్తరించిన జీహెచ్‌ఎంసీ(GHMC)లో పాలనా వ్యవహారాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుధ్య నిర్వహణ, పారదర్శక పౌర సేవలు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి వాటి విషయంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ తప్పనిసరి అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశంలో ఆదేశించారు. సీఎం మీటింగ్ ముగిసిన వెంటనే విస్తరిత జీహెచ్‌ఎంసీ పరిధిలో జోన్ల వారీగా పాలనా వ్యవహారాల పర్యవేక్షణకు అదనపు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జీ శ్రీజనను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్(Kukatpally, Serilingampally, Quthbullapur) జోన్ల వ్యవహారాలు ఆమె పరిశీలిస్తారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్, ఉప్పల్ జోన్ల అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌గా, మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్, ఉప్పల్ జోన్లు మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటయ్యే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News