GHMC: సీఎస్‌సీల్లో అవినీతి దందా.. చందానగర్ బాగోతంతో చర్చనీయాంశం
ABN , Publish Date - Aug 30 , 2025 | 07:24 AM
జీహెచ్‌ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో(సీఎస్సీ) నగదు స్వీకరణ ఆగడం లేదు. సూపర్ స్ట్రక్చర్స్ పన్ను పేరిట జరుపుతున్న నగదు చెల్లింపులు సిబ్బందికి అక్రమార్జన వనరుగా మారుతున్నాయి. చందానగర్ సర్కిల్‌లోని సీఎ్‌ససీలో బహిర్గతమైన బాగోతంతో ఇతర కేంద్రాల్లో పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది.
- ఇతర కేంద్రాల్లో పరిస్థితిపై ఆరా
- నగదు రహిత చెల్లింపుల విధానమున్నా పలు చోట్ల క్యాష్ తీసుకుంటోన్న వైనం
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC) పౌర సేవా కేంద్రాల్లో(సీఎస్సీ) నగదు స్వీకరణ ఆగడం లేదు. సూపర్ స్ట్రక్చర్స్ పన్ను పేరిట జరుపుతున్న నగదు చెల్లింపులు సిబ్బందికి అక్రమార్జన వనరుగా మారుతున్నాయి. చందానగర్ సర్కిల్‌లోని సీఎ్‌ససీలో బహిర్గతమైన బాగోతంతో ఇతర కేంద్రాల్లో పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, సీఎ్‌ససీల్లోని సిబ్బంది నగదును సొంతానికి వాడుకున్నట్టు గుర్తించారు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్(Khairatabad, Serilingampally, LB Nagar) జోన్ల పరిధిలో ఈ తరహా అక్రమాలు బహిర్గతమయ్యాయి. దీంతో ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుము ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని నిర్ణయించారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలులోకి తీసుకువచ్చారు.
అయినా నగదు చెల్లింపులు
జీహెచ్‌ఎంసీ ప్రధాన, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని భవనాల్లో సీఎ్‌ససీ కేంద్రాలున్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుము, సంస్థకు చెందిన వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలు, మునిసిపల్ మార్కెట్లు అద్దెల చెల్లింపు వంటి సేవలు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుముకు సంబంధించి నగదు చెల్లింపులకు అవకాశం లేదు. నోటరీ/వివాదాస్పద భూముల్లోని నిర్మాణాలకు సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్, ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్నును నగదు ద్వారా చెల్లించే అవకాశం పలు సీఎ్‌ససీల్లో ఉంది.
దీనినే చందానగర్‌లోని కంప్యూటర్ ఆపరేటర్ దుర్వినియోగం చేశారు. వసూలైన రూ.56 లక్షలను ఏడాదిన్నరగా సొంతానికి వాడుకున్నారు. సదరు ఆపరేటర్ డబ్బు చెల్లించిన అనంతరం విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కరే నగదు వాడుకున్నారా? ఇతర అధికారులు/ఉద్యోగులకు వాటాలున్నాయా? అన్న కోణంలోనూ అధికారులు విచారణ జరుపుతున్నారు. నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకువచ్చినా నగదు ఎందుకు తీసుకుంటున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది.

పర్యవేక్షణ ఏది?
సీఎ్‌ససీల్లో ఏ రోజు కారోజు ఎంత వసూలైంది? అందులో ఆన్‌లైన్ చెల్లింపులు, డీడీ, చెక్కులు ఎన్ని? నగదు ఎంత వసూలైందన్నది తనిఖీ చేయాలి. కానీ సంబంధిత అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఆపరేటర్లు ఇష్టానికి వ్యవహరిస్తున్నారు. బల్దియా ఖజానాకు గండి కొడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అక్రమాలు బయటపడితే మహా అయితే ఉద్యోగం పోతుంది.. అంతకంటే ఏం జరుగుతుందన్న ధీమా కూడా కొందరు సిబ్బంది ఇలా వ్యవహరించడానికి కారణంగా చెబుతున్నారు. చందానగర్ ఉదంతం నేపథ్యంలో ఇతర సీఎ్‌సల్లో లావాదేవిల పరిశీలనకు ఆర్థిక విభాగం సిద్ధమైంది. ప్రతి కార్యాలయంలో ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అడిటర్స్ నివేదకను బట్టి చర్యలు
సూపర్ స్ట్రక్చర్ పన్ను దుర్వినియోగానికి సంబంధించి ఆడిట్ తుది నివేదిక రావాల్సి ఉంది. దానిని బట్టి సదరు ఆపరేటర్‌పై చర్యలుంటాయి. పొరపాటు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టపరంగా ముందుకు వెళ్తాం.
- శశిరేఖ, చందానగర్ సర్కిల్ ఉపకమిషనర్
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News