By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోడల్ అధికారుల నియామకం
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:26 AM
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంస్థ.. ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్‌నూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదల పెట్టనుంది.
- అంశాల వారీగా బాధ్యతలు.. సెప్టెంబర్ 2 నుంచి సమ్మరీ రివిజన్
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంస్థ.. ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్‌నూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదల పెట్టనుంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ అధికారులు,
సిబ్బంది సమీకరణ, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పరిశీలన, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, రవాణా సదుపాయాలు, అవసరమైన సామగ్రి సమకూర్చడం తదితర బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో జూన్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. అప్పటి నుంచి శాసనసభా స్థానం ఖాళీగా ఉంది. బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావొచ్చని బల్దియా ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి.
79 పోలింగ్ కేంద్రాల పెంపు..!
ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ..
పార్టీల నేతలతో సమావేశం
అభ్యంతరాల సమర్పణకు నేడు ఆఖరు
ఉప ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రాంతాలు, కేంద్రాల సంఖ్య పెంచాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. కొత్తగా నమోదు కానున్న ఓటర్ల సంఖ్య, ఇప్పటికే కొన్ని చోట్ల 1400-1500 మంది ఓటర్లు ఉండంతో పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 329 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి సంఖ్య 408కి, 132 పోలింగ్ లొకేషన్లను 139కి పెంచాలని ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. 79 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉన్న దృష్ట్యా... అభ్యంతరాలుంటే నేటి సాయంత్రంలోపు తెలియజేయాలని సూచించారు.
అధికారులు నిర్వహించే బాధ్యతలు
- పోలింగ్ అధికారులు, సిబ్బంది సమీకరణ - అనురాగ్ జయంతి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్
- ఈవీఎం, వీవీ ప్యాట్‌ల నిర్వహణ - అపూర్వ చౌహాన్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
- పోలింగ్ సిబ్బందికి శిక్షణ - హేమంత్
కేశవ్‌పాటిల్, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్
అధికారులు నిర్వహించే బాధ్యతలు
- పోలింగ్ అధికారులు, సిబ్బంది సమీకరణ - అనురాగ్ జయంతి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్
- ఈవీఎం, వీవీ ప్యాట్‌ల నిర్వహణ - అపూర్వ చౌహాన్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
- పోలింగ్ సిబ్బందికి శిక్షణ - హేమంత్
కేశవ్‌పాటిల్, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్
మిగతా 6వ పేజీలో..
నోడల్ అధికారుల నియామకం
- డమ్మీ బ్యాలెట్ పేపర్ - రవికిరణ్, సికింద్రాబాద్
జోనల్ కమిషనర్
- రవాణా సదుపాయాలు - చీఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్
- ఎన్నికల సామాగ్రీ సమకూర్చడం - కే వేణుగోపాల్,
అదనపు కమిషనర్
- ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు (ఎంసీసీ)
- ఎం. సుదర్శన్, అదనపు ఎస్‌పీ (విజిలెన్స్)
- శాంతిభద్రతలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు-
నరసింహరెడ్డి, డీఎ్‌సపీ
- వ్యయ పరిశీలకులు - వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్
ఆఫ్ అకౌంట్స్
- ఎన్నికల పరిశీలకులు - విల్సన్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్
- మీడియా కమ్యూనికేషన్ అండ్ ఎంసీఎంసీ-
ఎం. దశరథ్, పీఆర్‌ఓ
- సైబర్ సెక్యురిటీ, ఐటీ, కంప్యూటరైజేషన్- సీ రాధ,
జాయింట్ కమిషనర్
- హెల్ప్‌లైన్, ఫిర్యాదులు పరిష్కారం - కార్తీక్ కిరణ్,
అసిస్టెంట్ ఇంజనీర్, ఐటీ
- వెబ్ కాస్టింగ్- తిరుమల కుమార్- వెబ్‌కాస్టింగ్.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News