TGSRTC: బస్సు ఆపలేదని పొట్టు పొట్టు కొట్టారు.. ఎక్కడంటే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:05 PM
ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో.. ఆర్టీసీ సిబ్బందిని అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందనే చెప్పాలి. ఫ్రీ బస్సు స్కీమ్ పుణ్యమా అని బస్సుల్లో సామర్థ్యానికి మించి ఎక్కేస్తున్నారు జనాలు. వొద్దు బాబోయ్..
హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో.. ఆర్టీసీ సిబ్బందిని అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందనే చెప్పాలి. ఫ్రీ బస్సు స్కీమ్ పుణ్యమా అని బస్సుల్లో సామర్థ్యానికి మించి ఎక్కేస్తున్నారు జనాలు. వొద్దు బాబోయ్.. బస్సు తట్టుకోలేదని డ్రైవర్, కండక్టర్ మొత్తుకున్నా వినిపించుకోవడం లేదు. పైగా.. వారితోనే వాగ్వాదానికి దిగుతున్నారు ప్రయాణికులు. డ్రైవర్, కండక్టర్లను తిట్టడమే కాకుండా.. పలు సందర్భాల్లో దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టీసీ బస్సు ఆపలేదనే నెపంతో బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు మహబూబాబాద్ నుండి వరంగల్‌కు వెళ్తోంది. దన్నసరి క్రాస్ రోడ్ వద్దకు రాగానే ప్రయాణికులు దిగేందుకు బస్సును నిలిపాడు డ్రైవర్ విష్ణు మూర్తి. ఆ తర్వాత వచ్చే బడి తండా స్టేజి వద్ద బస్సును ఆపాలంటూ ఓ మహిళ ప్రయాణికురాలు చేయి చూపించింది. అయితే, అప్పటికే బస్సులో 92 మంది ప్రయాణికులతో ఫుల్లుగా ఉంది. కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. వెనుకాల మరో బస్సు వస్తుందని డ్రైవర్ సదరు మహిళా ప్రయాణికురాలికి సూచించాడు. స్టేజ్ వద్ద బస్సు ఆపకుండా అక్కడి నుంచి బయలు దేరింది. అక్కడి నుంచి నేరుగా గాంధీ సెంటర్ వద్ద ప్రయాణికులు దిగెందుకు బస్సును డ్రైవర్ అపాడు.
అయితే, సదరు మహిళను బడి తండాకు చెందిన బిక్షపతి తన ద్విచక్ర వాహనంపై బస్సు వద్దకు తీసుకవచ్చి.. డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగా అదే సెంటర్‌లో టీ స్టాల్ నిర్వహించే మహేందర్ వచ్చి డ్రైవర్‌ను పరుష పదజాలంతో దూషించాడు. ఆపై మరింత రెచ్చిపోయి.. డ్రైవర్‌పై దాడి చేశాడు. దీంతో డ్రైవర్ బస్సుతో పాటు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బస్సును పోలీస్ స్టేషన్ ముందు నిలపడంతో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మరో బస్సులో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Also Read:
Cyber attack: ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి
Liquor Scam SIT raids: జగన్ బంధువు నివాసంలో ముగిసిన సిట్ దాడులు..
Ramachandra Rao Fires on Rahul: ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
For More Telangana News and Telugu News..