Liquor Scam SIT raids: జగన్ బంధువు నివాసంలో ముగిసిన సిట్ దాడులు..
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:48 PM
హైదరాబాద్, విశాఖపట్నంలో సునీల్ రెడ్డి కంపెనీలపై నిర్వహించిన సోదాల్లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే సిట్ బృందాలు చెన్నై, హైదరాబాద్‌లోని అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలపై సోదాలు నిర్వహించారు.
అమరావతి, సెప్టెంబర్ 20: మద్యం ముడుపుల కుంభకోణంలో (Liquor Scam) చెన్నై, హైదరాబాద్‌లో సిట్ అధికారుల సోదాలు ముగిశాయి. చెన్నైలో మూడు కంపెనీల్లో ఈరోజు (శనివారం) మధ్యాహ్నం వరకూ సోదాలు జరిగాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి(YS Anil Reddy)కి చెందిన మొత్తం 8 కంపెనీలు, ఆయన నివాసాలు రెండింటిపై సిట్ దాడులు చేసింది. ఇందులో భాగంగా కీలక డేటాను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. చెన్నైలో ఆయా కంపెనీలకు చెందిన బ్యాంక్ లావాదేవీలు చూసే అకౌంటెంట్లు, ఆడిటర్లను విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్, విశాఖపట్నంలో సునీల్ రెడ్డి కంపెనీలపై నిర్వహించిన సోదాల్లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే సిట్ బృందాలు చెన్నై, హైదరాబాద్‌లో అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలపై సోదాలు చేపట్టింది. చెన్నైలోని ఆల్వార్ పేట, విజిపి లేఅవుట్‌లోని అనిల్ రెడ్డి నివాసాలపైనా దాడులు నిర్వహించాయి సిట్ బృందాలు. మద్యం ముడుపులను బ్లాక్‌ను వైట్‌గా మార్చుకునేందుకు ఈ కంపెనీల ద్వారా విదేశాల్లోని షెల్ కంపెనీలకు పంపారని సిట్ భావిస్తోంది.
2019 నుంచి 2024 వరకు ఈ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు, అనిల్ రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులు, నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనే అంశాలపై ఆరా తీశారు. చెన్నై, హైదరాబాద్‌లో ఉన్న ఏడు బృందాలు ఈరోజు రాత్రికి విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో డేటాను విశ్లేషించి తదనంతర దర్యాప్తును చేపట్టాలని సిట్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సన్నిహితులు, సమీప బంధువులను సిట్ సరౌండ్ చేయడంతో వైసీపీ, తాడేపల్లి ప్యాలెస్‌లో ఉక్కపోత నెలకొంది.
ఇవి కూడా చదవండి
భిన్నంగా విజయవాడ దసరా వేడుకలు.. సెప్టెంబర్ 22 నుంచి
ఆ సీట్లు అమ్ముకున్నది మీరా మేమా.. జగన్‌పై నజీర్ మండిపాటు
Read Latest AP News And Telugu News