EV charging stations: సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ABN , Publish Date - Dec 26 , 2025 | 07:52 AM
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య నియంత్రణ, ఆర్ధిక వెసులుబాలో భాగంగా నగరంలో మరిన్ని ఎలక్ర్టిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో పెరుగుతున్న ఎలక్ర్టిక్ వాహనాల అవసరాలకు అనుగుణంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV charging stations) పెంచే దిశగా టీజీ రెడ్కోతో కలిసి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధి 10 సర్కిళ్లలో టీజీఎస్పీడీసీఎల్ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల ఆవరణలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతీ కార్యాలయంలో స్థలాల లభ్యత ఆధారంగా 2-3 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

బంజారాహిల్స్, సైబర్‌సిటీ, హబ్సిగూడ(Banjara Hills, Cybercity, Habsiguda), హైదరాబాద్ సెంట్రల్, సౌత్, మేడ్చల్, రాజేంద్రనగర్, సంగారెడ్డి, సరూర్‌నగర్(Sangareddy, Sarurnagar), సికింద్రాబాద్ సర్కిళ్లలోని ప్రధాన రహదారులకు సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాల ఆవరణలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి కమర్షియల్ ఆదాయం పెంచుకునే అవకాశాలను దక్షిణ డిస్కం పరిశీలిస్తోంది. పది సర్కిళ్లలో 300లకు పైగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News