Drugs Racket: హైదరాబాద్‌లో లేడీ టెక్కీ డ్రగ్ నెట్‌వర్క్.. గుట్టురట్టు చేసిన పోలీసులు
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:31 PM
న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ లక్ష్యంగా చేసుకొని భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బు సంపాదించే ప్లాన్ ఉన్నారు కేటుగాళ్ళు. హైదరాబాద్‌లో డ్రగ్స్ గుట్టు రట్టుచేశారు పోలీసులు
తెలంగాణలో ఇటీవల డ్రగ్స్ దందాకు పాల్పపడుతున్న వాళ్లపై కొరడా ఝులిపిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌లోని చిక్కడల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూనే, ఈజీ మనీ కోసం డ్రగ్స్ విక్రయిస్తున్న యువతి, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలను లక్ష్యంగా చేసుకొని నగరంలోని ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్, సంపన్న వర్గాల యువతకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇందుకోసం ఆమె బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి బెంగుళూర్, గోవా ప్రాంతాలకు వెళ్లి ఎండిఎంఏ, LSD బ్లాట్స్, ఓజీ కుష్ వంటి ఖరీదైన డ్రగ్స్‌ని తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కి తీసుకువస్తున్నారు. చిక్కడపల్లి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించి వీరిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి విలువైన డ్రగ్స్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సుష్మితకు ఐటీ బ్యాగ్ గ్రౌండ్ ఉండటం వల్ల పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు టెక్నాలజీని, ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ను ఉపయోగించి కస్టమర్లతో బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి...
చిరుత సంచారం.. తస్మాత్ జాగ్రత్త
ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ఆధారాలు...
Read Latest Telangana News And Telugu News