Share News

CPI ML New Democracy: ఆపరేషన్‌ కగార్‌పై న్యూడెమోక్రసీ నిరసన

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:53 AM

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతిచర్చలు ప్రారంభించాలని సీపీఐ (ఎంఎల్‌-న్యూడెమోక్రసీ) నేతలు నిరసన ప్రదర్శన చేశారు. దీనిపై బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మావోయిస్టులతో చర్చలకు ఆహ్వానం తెలిపారు

CPI ML New Democracy: ఆపరేషన్‌ కగార్‌పై న్యూడెమోక్రసీ నిరసన

హైదరాబాద్‌, చిక్కడపల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ కగార్‌ నిలిపేయాలని, కర్రెగుట్టలో నరమేధాన్ని ఆపాలని, మావోయిస్టులతో వెంటనే శాంతిచర్చలు ప్రారంభించాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్‌-న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన ప్రదర్శన జరిపారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. అడవులను కార్పొరేట్‌ రంగానికి అప్పగించేందుకు నరేంద్రమోదీ సర్కారు తలపెట్టిన ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఈ ప్రాంతంలో సాయుధ పోలీసులు తిష్ట వేయడంతో రోజూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఛత్తీ‌స్‌గఢ్‌- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారన్నారు. ఆదివాసీలను అంతంచేసే హంతక విధానాన్ని విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జేవీ చలపతిరావు, సాధినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్‌, ఝాన్సీ, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు వి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.


మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి: జాజుల

మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణించి వారితో కేంద్రం చర్చలు జరపాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మానవత్వంతో సమస్యకు పూర్తి పరిష్కారం చూపాలన్నారు. మావోయిస్టులు సైతం ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలోకి వచ్చి పోరాడాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 03:53 AM