Share News

Congress: రేపు గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళన సభ

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:55 AM

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) తీసుకున్న జై బాపూ, జై భీమ్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళనం జరగనుంది.

Congress: రేపు గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళన సభ

  • ఖర్గే ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహణ

  • జై బాపూ, జై భీమ్‌ కార్యక్రమంలో భాగంగా తొలిసభ రాష్ట్రంలోనే

హైదరాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) తీసుకున్న జై బాపూ, జై భీమ్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళనం జరగనుంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ గ్రామ కమిటీల అధ్యక్షులు హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని.. జై బాపూ, జై భీమ్‌ కార్యక్రమానికి సంబంఽధించి గ్రామ కమిటీల అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామకమిటీల అధ్యక్షులతో ఈ మేరకు సమ్మేళన సభలను నిర్వహించాలని ఏఐసీసీ భావిస్తోంది. తొలి సభను తెలంగాణలో నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ఇతర రా ష్ట్రాల్లోనూ నిర్వహించనుంది. గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళన సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్‌, మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.


గ్రామ కమిటీల అధ్యక్షుల ను సభకు తరలించే బాధ్యతలను మంత్రులు, ఇత ర ముఖ్యనాయకులకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసంగా 500 మంది గ్రామ శాఖల అధ్యక్షులను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం సభా ప్రాంగణంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, పొంగులేటి పరిశీలించారు. కాగా సమ్మేళన సభలో పాల్గొనేందుకు.. ఒకరోజు ముందుగానే ఖర్గే రానున్నారు. గురువారం సాయత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక్కడి ఓ హోటల్‌లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో జరిగే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం జరిగే టీపీసీసీ విస్తృత సమావేశంలోనూ పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేయనున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగే సమ్మేళన సభకు హాజరవుతారు. కాగా ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:55 AM