Share News

CM Revanth Reddy: గణతంత్ర రాజ్యంగా దేశం వర్ధిల్లాలి

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:23 AM

ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth Reddy: గణతంత్ర రాజ్యంగా దేశం వర్ధిల్లాలి

  • ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం

  • ప్రజలంతా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవించాలి: గవర్నర్‌

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాం గ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏడాదిలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టినట్లు ఓ ప్రకటనలో వివరించారు.


గణతంత్ర దినోత్సవం నాడే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమైన పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలంగాణలో ప్రజలంతా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ పటిష్ఠ అమలుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 04:23 AM