Delhi Visit: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:44 AM
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం కూడా అక్కడే ఉంటారని తెలిసింది. పార్టీ అధిష్ఠానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం కూడా అక్కడే ఉంటారని తెలిసింది. పార్టీ అధిష్ఠానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రేషన్‌కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తవి మంజూరు చేస్తోంది. ఇందులో భా గంగా ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. మెట్రో రెండో దశ విస్తరణ డీపీఆర్, ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
12 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఈ నెల 12 నుంచి 18వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బ్యాంకు లింకేజీ రుణా లు, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భా గంగా శనివారం ప్రజాభవన్‌లో మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఏటా రూ.20 వేల కోట్లకు తగ్గకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణా లు అందిస్తామన్నారు. ఈ రుణాలతో ఏ వ్యాపారాలు చేయాలి అనే అంశంపై ఈ నెల 7 నుంచి 9 వరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News