CM Revanth Reddy: ఏఐ హబ్, టీస్క్వేర్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:07 PM
నవంబర్ నెల చివరి కల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: ఐకానిక్ బిల్డింగ్‌గా వి-హబ్ ఉండేలా నిర్మాణం చేయాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో శనివారం మధ్యాహ్నం ఏఐ హబ్, టీస్క్వేర్ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నవంబర్ నెల చివరి కల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వి హబ్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని చెప్పారు. వి హబ్‌లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయడంతోపాటుగా వి హబ్ 24 గంటలపాటు పని చేయాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
MP R Krishnaiah Bandh: తెలంగాణ బంద్.. కిషన్ రెడ్డిని కలిసిన ఆర్.కృష్ణయ్య
BRS Jubilee Hills Bypoll: కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్