Nandamuri Padmaja: పద్మజ పార్థీవదేహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:26 PM
నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. పద్మజ మృతి వార్త తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ మంగళవారం నాడు అమరావతి నుంచి హుటాహుటిన..
హైదరాబాద్, ఆగస్టు 19: నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. పద్మజ మృతి వార్త తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ మంగళవారం నాడు అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. జయకృష్ణ నివాసానికి చేరుకుని.. పద్మజ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. కాసేపు అక్కడే ఉండి.. ఆ తరువాత తిరుగుపయనం అయ్యారు. జయకృష్ణ నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి పయనమయ్యారు.
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పద్మజ.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సొంత చెల్లెలు. పద్మజ మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులందరూ ఫిలింనగర్‌లోని జయకృష్ణ నివాసానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా పద్మజ పార్థవ దేహానికి నివాళులర్పించారు.
Also Read:
వాయుగుండం ఎఫెక్ట్.. భారీ వర్ష సూచన..
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
For More Telangana News and Telugu News..