Share News

Chicken: కోడి.. తిందామా.. వద్దా..

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:11 AM

చికెన్‌ గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత 15 రోజుల నుంచి కస్టమర్లు తగ్గడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బర్డ్‌ఫ్లూ(Bird flu) వ్యాధిపై వస్తున్న వదంతుల నేపథ్యంలో వినియోగదారులు చికెన్‌ కొనడం తగ్గించారు.

Chicken: కోడి.. తిందామా.. వద్దా..
Birdflue

  • బర్డ్‌ఫ్లూ భయంతో ఆలోచిస్తున్న చికెన్‌ ప్రియులు

  • గిరాకీలు లేక వెలవెలబోతున్న దుకాణాలు

హైదరాబాద్: చికెన్‌ గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత 15 రోజుల నుంచి కస్టమర్లు తగ్గడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బర్డ్‌ఫ్లూ(Bird flu) వ్యాధిపై వస్తున్న వదంతుల నేపథ్యంలో వినియోగదారులు చికెన్‌ కొనడం తగ్గించారు. దీంతో యజమానులు తీవ్ర నష్టాలలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. శేరిలింగంపల్లి(Sherilingampally) నియోజకవర్గంలో రోజువారీగా వందల కిలోల చికెన్‌ అమ్ముడుపోయేది. ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా వినియోగం లేకపోవడంతో దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బర్డ్‌ఫ్లూ కోళ్లకు తాకిందా లేదా అనే విషయం నిర్ధారణ లేదు. కానీ వివిధ మాంధ్యమాలలో వస్తున్న వదంతులతో చికెన్‌ వాడకం తగ్గింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బాలికను వ్యభిచారంలో దించిన నలుగురికి జైలుశిక్ష


city7.2.jpgప్రతి రోజు దుకాణాలు తెరిచి ఉంచడమే కానీ గిరాకీ సరిగా ఉండడం లేదు. ఇలా అయితే దుకాణాలు నడుపడం కష్టమేనని పలువురు అంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, చందానగర్‌(Madhapur, Kondapur, Gachibowli, Chandanagar), శేరిలింగంపల్లి, మియాపూర్‌ హఫీజ్‌పేట్‌ డివిజన్లలో పదిరోజుల నుంచి చికెన్‌ వాడకం తగ్గింది. వేలల్లో ప్రతి నెల దుకాణాల అద్దె కడుతున్నామని గిరాకీ లేకపోవడంతో అద్దె ఎలా చెల్లించాలని పులువురు అంటున్నారు. ఇలా అయితే తమ పొట్ట గడవడం కూడా కష్టంగానే మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


city7.jpg

ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 01:36 PM