Share News

ITI Upgrades: హైదరాబాద్‌లో ఎన్‌సీవోఈ

ABN , Publish Date - May 08 , 2025 | 04:26 AM

దేశవ్యాప్తంగా 1000 ఐటీఐల నవీకరణ, ఐదు జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల(ఎన్‌సీవోఈ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ITI Upgrades: హైదరాబాద్‌లో ఎన్‌సీవోఈ

  • రూ.60 వేల కోట్లతో దేశంలో ఐదు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు

  • ఐటీఐల నవీకరణ.. ఐఐటీల్లో మరో 6500 సీట్లు.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 1000 ఐటీఐల నవీకరణ, ఐదు జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల(ఎన్‌సీవోఈ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఉన్నత విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు, విద్యాసంస్థల విస్తరణ, విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఆమోదముద్ర వేసింది. 2024-25, 2025-26 బడ్జెట్లలో చేసిన ప్రకటన మేరకు ఐటీఐల నవీకరణతోపాటు ఎన్‌సీవోఈల ఏర్పాటుకు కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని రూ.60 వేల కోట్ల వ్యయంతో (కేంద్రం వాటా రూ.30 వేల కోట్లు, రాష్ట్ర వాటా రూ.20 వేల కోట్లు, పారిశ్రామిక వాటా రూ.10 వేల కోట్లు) అమలు చేయనున్నారు.


ఈ పథకం కింద భువనేశ్వర్‌, చెన్నై, హైదరాబాద్‌, కాన్పూర్‌, లూథియానాల్లోని ఐదు జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల్లో.. ఎన్‌సీవోఈలను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. 50 వేల మందికి పైగా శిక్షణను అందిస్తారు. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో ఏపీలోని తిరుపతి ఐఐటీ సహా కేరళ, ఛత్తీ్‌సగఢ్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటకలోని ఐదు కొత్త ఐఐటీలకు మహర్దశ పట్టనుంది. 130 ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా 6,500కు పైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:26 AM