BRS: అయోమయంలో బీఆర్‌ఎస్ క్యాడర్.. దిక్కుతోచని స్థితిలో ఇళ్లకే పరిమితం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:01 AM
భారత రాష్ట్ర సమితి పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలోపడిపోయి ఇళ్లకే పరిమితమైపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు ఫుల్ జోష్‌లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు.. ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు,
- అబ్దుల్లాపూర్‌మెట్ బరిలో నిలబడని సర్పంచ్, వార్డుసభ్యులు
- సమన్వయం లేకే ఈ దుస్థితి?
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్(BRS) క్యాడర్ అయోమయంలో పడింది. ఈ గ్రామ పంచాయతీ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో అధిష్ఠానంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, మండల పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి పార్టీ అధిష్ఠానం నిర్లక్ష్యమే ఇందుకు కారణం అంటూ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు అధిష్ఠానం స్థానిక క్యాడర్‌ను సమన్వయం చేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లకే ...
అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామ పంచాయతీలో 10,310 ఓట్లున్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ప్రస్తుతం పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌తో పాటు కనీసం వార్డు అభ్యర్థులు కూడా బరిలో నిలబడలేని దుస్థితి నెలకొంది. ఇందుకు కారణం పార్టీ నిర్లక్ష్యమే అంటూ కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల బరిలో పార్టీ సర్పంచ్, వార్డు అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్‌ఎస్ క్యాడర్ ఇళ్లకే పరిమితం అయింది. పార్టీ అభ్యర్థులు బరిలో లేకపోవడం తమకు తలనొప్పిగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీని కాదని ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కావడం లేదంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
Read Latest Telangana News and National News