Hyderabad: సినిమాను మించిన సీన్.. అటు దొంగలు.. ఇటు పోలీసులు.. చివరకు..
ABN , Publish Date - Jan 16 , 2025 | 09:24 PM
భాగ్యనగరంలో సినిమాను మించిన క్రైమ్ సీన్ చోటు చేసుకుంది. ఓవైపు దొంగలు.. వారిని పట్టుకునేందుకు మరోవైపు పోలీసులు.. తుపాకీ కాల్పుల మోత..

హైదరాబాద్, జనవరి 16: భాగ్యనగరంలో సినిమాను మించిన క్రైమ్ సీన్ చోటు చేసుకుంది. ఓవైపు దొంగలు.. వారిని పట్టుకునేందుకు మరోవైపు పోలీసులు.. తుపాకీ కాల్పుల మోత.. వెరసి పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. అఫ్జల్‌గంజ్‌లో కాల్పులకు తెగబడిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు జరిపిన దొంగలు.. చివరకు పోలీసుల చేతికి చిక్కారు. దీనికి ముందే ఏం జరిగేందనేది ఓసారి చూద్దాం..
గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో శివాజీ చౌక్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు.. భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏటీఎంలో పెట్టేందుకు తెచ్చిన రూ. 93 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలో సంచలన సృష్టించింది.
అయితే, నిందితులు బీదర్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చారు. నిందితులు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్‌లో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 7:30 గంటలకు అఫ్జల్‌గంజ్ నుండి రాయపూర్‌కు బయలుదేరాల్సి ఉంది. బస్సు ఎక్కేటప్పుడు లగేజ్ తనిఖీల్లో భాగంగా టికెట్ మేనేజర్ జహంగీర్ నిందితుల లగేజ్ చెక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ తనిఖీకి నిందితులు ఒప్పుకోలేదు. ఇంతలో నిందితుల వెనకాలే ఉన్న బీదర్ పోలీసులు.. తాము పోలీసులమని.. తమ బ్యాగ్‌లు తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మరో కేసులో వీరు హైదరాబాద్‌కు వచ్చారు. వీరిని గమనించిన నిందితులు కంగారు పడ్డారు. తమ కోసమే వచ్చారని నిందితులు భావించారు. మరోవైపు బ్యాగులు తనిఖీ చేయాల్సిందేనని జహంగీర్ నిందితులతో వాదించాడు. జహంగీర్‌కు రూ. 50 వేలు ఇచ్చి తమ బ్యాగ్ తనిఖీ చేయొద్దంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు నిందితులు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కిందకు దిగాలంటూ నిందితులను జహంగీర్ హెచ్చరించారు. దీంతో వారు బ్యాగులతో పాటు కిందకు దిగగా పోలీసుల భయంతో తప్పించుకోవడానికి జహంగీర్‌పై కాల్పులు జరిపారు. ఐదు రౌండ్లు కాల్పులు జరుపగా.. జహంగీర్ కడుపు, కాలిలోకి రెండు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. కాల్పులు జరిపి డబ్బుతోపాటు అక్కడి నుండి పరారయ్యారు నిందితులు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ..
సైఫ్‌పై దాడి చేసింది వీడే.. ఇలా ఉన్నావేంట్రా..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మ్యాటర్ ఏంటంటే..
For More Telangana News and Telugu News..