Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:46 PM
Weather Report: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుంది. ప్రయాణాలకు అనుకూలమా? కాదా? అంటే.. అందుకు వాతావరణ విభాగం ఏం చెబుతొందంటే..?
Telugu States Weather Update: సంక్రాంతి సందడి ముగిసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వస్థలాలకు వెళ్లిన వారు.. మళ్లీ తిరుగు ముఖం పట్టారు. అలాంటి వేళ.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుంది. ప్రయాణాలకు అనుకూలమా? కాదా అంటే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తొలగిపోయింది. అయితే అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడిన వాతావరణం నెలకొంది. దీని వల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో మరికొద్ది రోజుల్లో.. అంటే.. జనవరి 18, 19 తేదీల్లో అక్కడక్కడా.. భారీ వర్షాలు, చాలా పద్రేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతారణ విభాగం గురువారం వెల్లడించింది.
అరేబియా సముద్రంలో అల్పపీడనం తొలగిపోయింది. కానీ ద్రోణి తరహా వాతావరణం ఉంది. దాని వల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 18, 19 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక తెలుగు రాష్ట్రాలకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి వాతావారణ హెచ్చరికలు జారీ చెయ్యలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే గాలి కదలిక అధికంగా ఉంటుంది. వర్షాలు మాత్రం ఎక్కడా పడే అవకాశాలు లేవు. కానీ రాత్రి వేళ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చలి పెరుగుతోందని వివరించింది. అలాగే గాలి వేగం చూస్తే.. బంగాళాఖాతంలో గంటకు 30 కిలోమీటర్లు.. ఏపీలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. అలాగే తెలంగాణలో మాత్రం గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది.
Also Read: మళ్లీ అగ్ని ప్రమాదం.. రూ. కోటి విలువైన పత్తి దగ్ధం
పగటి వేళ ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉండనుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. రాత్రి వేళ తెలంగాణలో 18 డిగ్రీలు, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని పేర్కొంది. అదే విధంగా తేమ మాత్రం పగటి వేళ.. తెలంగాణలో 50 శాతం ఉంటే.. ఏపీలో 60 శాతంగా ఉంటుందంది. రాత్రివేళ తెలంగాణలో 94 శాతం ఉంటే.. ఏపీలో 95 శాతం ఉంటుందని వివరించింది. అయితే రెండు రాష్ట్రాల్లో రాత్రి వేళ మంచు ఎక్కువగా కురుస్తుందంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం బాగానే ఉంటుంది. పండగ వేళ.. ఊర్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చే వారికి ప్రయాణం మాత్రం ఆహ్లాదకరంగా ఉండనుంది.
Also Read : ఎల్‌ఐసీ పాలసీ చేసి మర్చిపోయారా? ఇదిగో ఇలా క్లైయిమ్ చేసుకోవచ్చు..
Also Read: సైఫ్ నివాసంలోకి దొంగ ఎలా ప్రవేశించాడంటే..?
Also Read: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆందోళనలో కరీనా కపూర్
For AndhraPradesh News And Telugu News