Bhatti Vikramarka: అబద్ధాల మీదే బీఆర్‌ఎస్ పుట్టుక
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:56 AM
‘‘ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తున్నాం. కానీ అర గ్యారెంటీ అమలు చేశామని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అబద్ధాల మీదే బీఆర్‌ఎస్ పుట్టింది.
తప్పుడు ప్రచారంతోనే పదేళ్ల పాలన
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు: భట్టి
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తున్నాం. కానీ అర గ్యారెంటీ అమలు చేశామని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అబద్ధాల మీదే బీఆర్‌ఎస్ పుట్టింది. వాళ్లు అధికారంలో ఉన్నంతకాలం అబద్ధపు ప్రచారం చేసుకుని బతికారు. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను కూడా మేం పరిష్కరిస్తున్నాం’’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్) పరిధిలో ఎంపికైన 92 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లకు నియామక పత్రాలను, ట్రాన్స్‌కోలో 20 మందికి కారు ణ్య నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రస్తుతం తాము ఆ అప్పులనుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువస్తున్నామని చెప్పారు. లక్షలాది మంది ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇచ్చే పరిస్థితిని తెచ్చామన్నారు. ఏడాదికాలంలోనే 56 వేల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ‘‘రుణమాఫీ జరిగిందోలేదో?.. రూ. 500కు గ్యాస్ సిలిండర్ వస్తోందో లేదో గ్రామాల్లో తిరిగి పరిశీలించుకోవాలి’’ అని సూచించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసాతో పాటు భూములు లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సహాయం అందించనున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ఆయన చెప్పారు.
సంక్షేమంతోపాటు మౌలిక వసతులపైనా దృష్టి
తమ ప్రభుత్వం సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు కేటాయిస్తోందని భట్టి తెలిపారు. దుబారా ఖర్చులు చేయకుండా సంపదను పెంచి ప్రతి పైసా పేదలకే పంచుతామని చె ప్పారు. రాష్ట్ర అభివృద్ధి, జీడీపీ విద్యుత్ శాఖతో ముడిపడి ఉందని, నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌శాఖలో 1912 టోల్‌ప్రీ నెంబర్ ఇచ్చామని,. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ: తుమ్మల
శ్రీశైలం, సాగర్‌లో నిల్వలు తగ్గుతున్నందున్న పక్క రాష్ట్రాన్ని సంప్రదించి మన వాటా దక్కించుకుని రబీకి నీరందేలా చూసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ను అం దించాలని, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లందించామనే కీర్తి భట్టికి రావాలని ఆయన చెప్పారు. బడ్జెట్‌లో 35ు నిధులను వ్యవసాయ శాఖకు తమ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివి ధంగా రూ.30 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని ఆయన చెప్పారు.