Share News

Hyderabad: హైదరాబాద్‌-ముజఫర్‌పూర్‌ మార్గంలో.. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Sep 30 , 2025 | 10:04 AM

ముజఫర్‌పూర్‌-హైదరాబాద్‌ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‏ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్‌(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

Hyderabad: హైదరాబాద్‌-ముజఫర్‌పూర్‌ మార్గంలో.. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

- ఆరంభ స్పెషల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన రైల్వేమంత్రి

- అక్టోబరు 14నుంచి అధికారికంగా నడిపేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: ముజఫర్‌పూర్‌-హైదరాబాద్‌ (చర్లపల్లి)(Muzaffarpur-Hyderabad (Cherlapalli) మార్గంలో కొత్తగా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‏ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్‌(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అక్టోబరు 14న ముజఫర్‌పూర్‌ నుంచి, 16న హైదరాబాద్‌ (చర్లపల్లి) నుంచి రెగ్యులర్‌ (15293/94) రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్యరైల్వే ఏర్పాట్లు చేస్తోంది.


city5.2.jpg

ప్రతి మంగళవారం చర్లపల్లి(Cherlapalli) నుంచి రాత్రి 9 గంటలకు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు. రైలులో 6 స్లీపర్‌ క్లాస్‌, 12 సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ బోగీలు ఉంటాయని పేర్కొన్నారు.


city5.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నైరుతిలో సాధారణ వర్షపాతమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 30 , 2025 | 10:04 AM