BJP: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రతిష్టాత్మక నిర్ణయాలు..
ABN , Publish Date - Jan 23 , 2025 | 10:26 AM
గాంధీనగర్ డివిజన్‌లోని పలు బస్తీ ల్లో బుధవారం సంవిధాన్ గౌరవ అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా భారతరత్న డా.బి ఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పించి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పాలనలో బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించే విధానాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం నిర్వహించారు. డి
హైదరాబాద్: గాంధీనగర్ డివిజన్‌లోని పలు బస్తీ ల్లో బుధవారం సంవిధాన్ గౌరవ అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా భారతరత్న డా.బి ఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పించి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పాలనలో బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించే విధానాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వీవీ గిరినగర్, వాల్మీకినగర్ బస్తీల్లో సమావేశాలు నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber Crime: ఐ ఫోన్ గెలుచుకున్నారంటూ బురిడీ కొట్టించారు..
డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం(Secunderabad Parliamentary Constituency) జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్‌కుమార్ పాల్గొ ని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్ తొలగించడం ఎంతో గర్వించదగ్గ ప్రతిష్టాత్మక నిర్ణయాలు అని గుర్తు చేశారు.

రాహుల్‌గాంధీ(Rahul Gandhi) భారతదేశంలో ఉంటూ భారతదేశంతో పోరాటం చేస్తాననడం ఎంతవరకు సమంజసం అని అసహనం వ్యక్తం చేశా రు. బీజేపీ సీనియర్ నాయకులు రత్నసాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, సురేష్, ఆకుల సురేందర్, శ్రీనివాస్, సాయికుమార్, యాదగిరి, సత్యేందర్, సాయికృష్ణ, నీరజ్, ధీరజ్, ప్రకాష్, బస్తీవాసులు నిర్మల, లావణ్య, రేణుక, ప్రేమలత, శ్రీలత, అనురాధ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News