Share News

Sankranti Celebrations: నేలపై హరివిల్లులు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:39 AM

ముత్యాల ముగ్గులతో పుడమి పులకించింది. రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది! ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు..

Sankranti Celebrations: నేలపై హరివిల్లులు..

సంక్రాంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ముగ్గుల పోటీలు

  • తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో పోటీల్లో పాల్గొన్న 12వేల మందికిపైగా మహిళలు

  • జిల్లాలవారీ విజేతలకు 10న హైదరాబాద్‌లో ఫైనల్స్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ముత్యాల ముగ్గులతో పుడమి పులకించింది. రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది! ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి. 12 వేల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ రంగవల్లులతో సంక్రాంతి శోభను ఇనుమడింపజేశారు. ప్రతి కేంద్రంలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ బహుమతి రూ.4,000, తృతీయ బహుమతి రూ.3,000తోపాటు అనేక కన్సొలేషన్‌ బహుమతుల్ని మహిళలు గెల్చుకున్నారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికైన పదిమంది మహిళలకు ఈ నెల 10న హైదరాబాద్‌లో ఫైనల్‌ పోటీలు జరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 13 పాత జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఒక్కొక్కరు... మొత్తం 15 మందికి ఈ నెల 11న విజయవాడలో ఫైనల్స్‌ జరుగుతాయి.


ఫైనలిస్టులకు రూ.1,70,000కు పైగా బహుమతులు, ఇంకా గిఫ్ట్‌ హ్యాంపర్లు లభిస్తాయి. కాగా.. ఈ పోటీలకు ఆయా జిల్లాల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. న్లలగొండలో జరిగిన పోటీలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. మల్కాజిగిరిలో ఎంపీ ఈటల రాజేందర్‌, హనుమకొండలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, తాండూర్‌లో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, బోధన్‌లో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌ రెడ్డి, జగిత్యాలలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరి సంజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

11.jpg

Updated Date - Jan 06 , 2025 | 03:39 AM