MP R. Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
ABN , Publish Date - Jan 28 , 2025 | 11:54 AM
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు.
- ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు. బీసీ వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీరామ్ జ్ఞానేశ్వర్‌కు ఆయన నియామక పత్రం అందజేసి మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber Fraud: ఆన్‌లైన్ లోన్ పేరుతో సైబర్ మోసం..

కుల గణన పూర్తయినప్పటికీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, ఎంపీటీస్, జడ్పీటీసీ(Sarpanch, MPTS, ZPTC)లలో బీసీలకు 20 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని 42 శాతం పెంచితేనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి సాధిస్తారని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో కూడా బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీలలోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క దానికి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్; వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజి, నంద గోపాల్, మట్ట జయంతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..
ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ
ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News