Share News

Trains: కాచిగూడ-హిస్సార్‌ మధ్య 22 స్పెషల్‌ రైళ్లు

ABN , Publish Date - Apr 10 , 2025 | 10:41 AM

మల్కాజిగిరి, మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర మీదుగా హిస్సార్‌ వెళ్లేందుకు 22 వేసవి స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆయా స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది.

Trains: కాచిగూడ-హిస్సార్‌ మధ్య 22 స్పెషల్‌ రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: కాచిగూడ-హిస్సార్‌(Kacheguda-Hissar) మధ్య 22 వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 17 నుంచి జూన్‌ 26 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4 గంటలకు కాచిగూడ నుంచి, ఈ నెల 20 నుంచి జూన్‌ 29వరకు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ఈ ప్రత్యేకరైళ్లు బయలుదేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: హనుమాన్‌ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు


city6.2.jpg

ఈ ప్రత్యేక రైళ్లలో అన్నీ ఏసీ త్రీటైర్‌ కోచ్‌లే ఉంటాయని, మార్గమధ్యంలో మల్కాజిగిరి, మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర(Malakajgiri, Medchal, Kamareddy, Nizamabad, Basara:), ధర్మాబాద్‌, ముద్కేడ్‌, నాందేడ్‌ తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రయాణికులకు రిజర్వేషన్‌ సదు పాయం అందుబాట్లో ఉంటుందని సీపీఆర్‌ఓ తెలిపారు.


city6.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

Greenfield Expressway: హైదరాబాద్‌-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

CM Revanth Reddy: బ్రిటిష్‌ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 10 , 2025 | 10:41 AM