Share News

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:38 AM

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి - రామేశ్వరం, హైదరాబాద్‌ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.

Trains: వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి - రామేశ్వరం(Cherlapalli - Rameshwaram), హైదరాబాద్‌ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు మంగళవారం తెలిపారు. జూలై 2 నుంచి 23 వరకు చర్లపల్లి-రామేశ్వరం మధ్య (07695) 4 రైళ్లు, జూలై 4 నుంచి 25 వరకు రామేశ్వరం-చర్లపల్లి మధ్య (07696) 4 రైళ్లు, జూలై 5 నుంచి 26 వరకు హైదరాబాద్‌-కొల్లం మధ్య (07193) 4 రైళ్లు, జూలై 7 నుంచి 28 వరకు కొల్లం - హైదరాబాద్‌ మధ్య (07194) 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.


city2.2.jpg

అలాగే జూన్‌ 26 నుంచి జూలై 31 వరకు సుబేదర్‌గంజ్‌ - చర్లపల్లి (04121), జూన్‌ 28 నుంచి ఆగస్టు 2 వరకు చర్లపల్లి-సుబేదర్‌ గంజ్‌(Cherlapalli-Subedar Ganj) (04122), జూన్‌ 26 నుంచి జూలై 3 వరకు యశ్వంత్‌పూర్‌-యోగ్‌నగరి రుషీకేష్‌ (06597), జూన్‌ 28 నుంచి జూలై 5 వరకు యోగ్‌నగరి రుషీకేష్‌- యశ్వంత్‌పూర్‌ (06598) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 25 , 2025 | 07:42 AM